సీరియస్ తో పాటు వినోదం ఉన్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: నరేష్

సోమవారం, 21 నవంబరు 2022 (17:14 IST)
Allari Naresh, Anandi, Sri Vishnu and others
అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.  ఆనంది కథానాయిక. ఈ నెల 25న సినిమా థియేటర్లలో  విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానిర్వహించారు. హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకులు  ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తిరుమల కిషోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ అతిధులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ గారికి చిత్ర యూనిట్ నివాళులు అర్పించింది.
 
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో పరిచయం అవుతున్న నిర్మాత రాజేష్ దండా, దర్శకుడు మోహన్  ఇద్దరికీ కంగ్రాట్స్. రాజేష్ కి మినీ దిల్ రాజు అని పేరు పెట్టాం. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు గారిలానే పెద్ద నిర్మాత కావాలి. మోహన్ గారు చాలా ప్రతిభ వున్న దర్శకుడు. కథ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశాం. అందరం ఒక టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. అనంది గారు ఈ సినిమా చేస్తున్నపుడు బేబీకి బర్త్ ఇచ్చి మూడో నెల. ఆమె చాలా కష్టపడతూ ఏ రోజు కష్టాన్ని బయటికి చెప్పాకుండా చేశారు. ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది అని అన్నారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ. నరేష్ మొదటి నుండి అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పెద్ద సక్సెస్ అవ్వాలి. మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' గురించి నిర్మాత రాజేష్ గారు చెప్పారు. చాలా కంటెంట్ వున్న సినిమా అనిపించింది. రాజేష్ గారికి, ప్రసాద్ గారికి కథలు ఎంచుకోవడంలో మంచి టేస్ట్ వుంది. మారేడుమిల్లి అంటే నాకు చాలా ఇష్టం. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' పేరు పెట్టి అక్కడే సినిమా తీసిన దర్శకుడు మోహన్ గారికి కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా సహజంగా నటిస్తారు. . 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మంచి పాజిటివ్ టీం. 25 తేదిన అందరూ థియేటర్ కి వచ్చి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను.
 
ఆనంది మాట్లాడుతూ. నా లైఫ్ లో చాలా స్పెషల్ మూవీ. మూడు నెలల బేబీతో ఈ సినిమా చేశా.  టీం ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పుడూ మర్చిపోలేను.  నాపై ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నాంది తర్వాత నరేష్ గారి తో పని చేయడం చాలా ఆనందంగా వుంది. నరేష్ గారు అద్భుతమైన యాక్టర్. ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించిన రాజేష్ గారికి స్పెషల్ థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు.
 
చిత్ర దర్శకుడు ఏఆర్ మోహన్ మాట్లాడుతూ.. ఇది నా 17 ఏళ్ల కల. ఈ కలని నిజం చేసిన అల్లరి నరేష్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. నా లైఫ్ లాంగ్ నరేష్ గారికి థాంక్స్ చెబుతూనే వుంటాను. ప్రజల జీవితాన్ని తెరపై చెప్పాలనే కోరికే  'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కథ. నిర్మాతలు రాజేష్ గారికి కృతజ్ఞతలు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘు బాబు.. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఆనంది గారు చాలా అద్భుతంగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కడలి, శ్రీ చరణ్, ఎడిటర్ ప్రసాద్, పృథ్వీ మాస్టర్, శేఖర్ మాస్టర్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారికి కృతజ్ఞతలు'' తెలిపారు.
 
చిత్ర నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న సినిమా థియేటర్లలో  విడుదలౌతుంది. అందరూ థియేటర్లో చూసి నా మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు