ప్రేమ,పెళ్లి, స్నేహం..ఇలా ఏ బంధానికైనా కొంత టైమ్ ఇవ్వాలి అంటున్నారు దర్శకుడు లక్ష్మణ్ మేనేని. ఎదుటివారిపై త్వరగా అభిప్రాయానికి వచ్చి విడిపోవడం ఇవాళ్టి యువతలో ఎక్కువగా జరుగుతోందని ఆయన చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, సహజీవనం వంటి అంశాల నేపథ్యంతో దర్శకుడు లక్ష్మణ్ మేనేని "మ్యాడ్" అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్ బ్యానర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మించారు. "మ్యాడ్" మూవీ ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.