కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్థపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అందరూ అంటారు. అది నిజం కాదు.. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై ప్రేమ, గౌరవం చూపించాలి. ప్రియమైన వారితో టైమ్ స్పెండ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఖాళీ సమయం దొరికితే డిన్నర్ డేట్, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. వల్ల జీవితం మరింత అందంగా మారుతుంది. ఇవి ఫాలో కాకపోతే ఇప్పటికేౖనా దయచేసి మీ వారి కోసం సమయాన్ని కేటాయించడం అలవాటు చేసుకోండి అని ఉపాసన ఆ వీడియోలో పేర్కొన్నారు.