పేర్ని నాని, చిరంజీవి గురించి మోహ‌న్‌బాబు తాజా స్టేట్ ఏమిటంటే!

ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (15:19 IST)
Vishnu,neani-mohanbabu
ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవితోపాటు స్టార్ హీరోలు, రాజ‌మౌళి ఎ.పి.లో వై.ఎస్‌.జగ‌న్‌ను క‌లిశారు. ఆ త‌ర్వాత మోహ‌న్‌బాబు, మంచు విష్ణు మంత్రి పేర్నినానిని క‌లిశారు. దాంతో మోహ‌న్‌బాబు, పేర్ని నాని మ‌ధ్య ఏదో ఒప్పందం వుంద‌ని వార్త వైర‌ల్ అయింది. ఈ విష‌యం మంచు మోహ‌న్‌బాబు ఆదివారంనాడు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్ర‌శ్న వేయ‌గానే మీడియావారికి ఏం ప‌నిలేద‌య్యా! అంటూ సున్నితంగా మాట్లాడారు.
 
రాసుకోండి ఏం జ‌రిగిందో చెబుతానంటూ త‌న శైలిలో వివ‌రించారు. పేర్ని నాని నాకు ఎప్ప‌టినుంచో స్నేహితుడు. బొత్స కూడా అంతే. నాకు ఎంతోమంది సి.ఎం.లు, గ‌ర్న‌ర్న‌ర్‌లు స్నేహితులు. మా ఇంటికి భోజ‌నానికి వ‌స్తారు. నేను వెళతాడు. ఇటీవ‌లే బొత్సకు, పేర్ని నానికి నాకు కామ‌న్‌ఫ్రెండ్ అయిన వారింట్లో శుభాకార్యానికి హాజ‌ర‌య్యాను. అక్క‌డ న‌న్ను చూసి ఒక‌సారి ఇంటికి రండి అని పిలిచాడు. అక్క‌డే వున్నాం క‌దా వెళ్ళాం. టీ, స్నాక్స్ తిని వ‌చ్చేశాం. ఆ త‌ర్వాత  త‌ను నాకు శాలువా క‌ప్పాడు. అంతే.. జ‌రిగింది. 
 
ఇక దీనిని చిలువ‌లు ప‌లువ‌లుగా మీడియా ఏదో రాసేసింది. నేను ముక్కుసూటి మ‌నిషిని. ఇండ‌స్ట్రీ గురించి నాది ఒక‌టే మాట‌. గ‌తంలో ఏం మాట్లాడానే ఇప్పుడు అదే చెబుతున్నా. ఇక చిరంజీవి వంటి ప్ర‌ముఖులు జ‌గ‌న్ క‌లిశారు. దాని గురించి నాకు ఏమీ తెలియ‌దు. నేను పేర్ని నాని క‌లయిక‌కు సినిమా రంగానికి సంబంధ‌మేలేదు. అని నొక్కి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు