సార్ధక నామధేయులు మాత్రం కొందరే. అందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా చాలా ముఖ్యంగా తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్న వ్యక్తి, శక్తి డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందంగారు. నేడు ఆయన పుట్టినరోజు. ఆయన జీవితం.. జీవితంలోని కొన్ని అద్భుతమైన సంఘటనలు, టర్న్‌లు, ట్విస్టులు వీటన్నింటి సమాహారమే నేను అనే పుస్తకం.. ప్రతేడాది పుట్టినరోజు అనగానే. తెలియకుండానే ఈ ఏడాది ఏమి సాధించాం? అనుకుంటాం. ఈ ఫిబ్రవరి ఒకటో తేది స్పెషల్ ఏంటంటే.. బ్రహ్మి ఇప్పటివరకు సాధించిన పుట్టినరోజలన్ని కట్టకట్టి లెక్క పెట్టి ఇది నేను నేనుగా సంధించి సాధించుకున్నాను.. అని 321 పేజిల్లో తన జీవితాన్ని మడతపెట్టి ఏడవండి? నవ్వండి? ఏమైనా అనుకోండి? ఇదే సత్యం అని జీవితం మొత్తాన్ని చెప్పి తన బర్త్‌డేకి ఈ ఏడాది ఎంతో స్పెషల్ అంటూ తన ఫ్యాన్స్‌కి తనను చూసి నవ్వే ప్రతివారికి గిఫ్ట్ ఇచ్చారు...