వాస్తవానికి విద్యాబాలన్‌కు నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌తో వివాహమైంది. అయితే ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని, ఆమె విడాకులు తీసుకోనుందని గ్యాసిప్‌లు బయల్దేరాయి. అలాగే విద్య గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు కూడా.
వీటిపై విద్యాబాలన్ తనదైనస్టైల్లో స్పందించారు. 'సిద్ధార్థ్‌తో నాకెలాంటి విభేదాలూ లేవు. మేమిద్దరం ఇప్పుడు కలిసే ఉన్నాం. ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో తెలీదు. నా ప్రెగ్నెన్సీ గురించి కూడా ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. మీడియా వాళ్లు ప్రతీనెలా నన్ను ప్రెగ్నెంట్ చేస్తున్నారు. మొదట్లో ఇలాంటి వార్తలకు బాధపడేదాన్ని. ఇప్పుడు అవి అలవాటైపోయాయ'ని ఆమె వాపోయింది.