టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సీనియర్ హీరోలందరికీ మీనా జోడీగా నటించారు. కొన్ని నెలల క్రితం భర్తను కోల్పోయిన మీనా ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా తన ఫ్రెండ్‌తో కలిసి విదేశీ పర్యటన చేసిన మీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఐశ్వర్యారాయ్ గురించి ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది.
పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన నందిని పాత్ర తన డ్రీమ్ రోల్ అని ఆ పాత్రను కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ కలుగుతోందని మీనా చెప్పుకొచ్చారు. తన లైఫ్‌లో ఒకరిని చూసి అసూయ పడటం ఇదే తొలిసారి అని మీనా పోస్టు చేశారు. మీనా చేసిన పోస్ట్‌కు 40,000కు పైగా లైక్స్ వచ్చాయి.