మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ వాయిదా వేశారు కారణం..

డీవీ

సోమవారం, 30 డిశెంబరు 2024 (17:34 IST)
Chiru- Hilter
హిట్లర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని చెల్లెళ్ళ సెంటిమెంట్ కి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు. అలాంటి చిత్రం నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రీరిలీజ్ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ నేడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 
సాంకేతిక కారణాలవల్ల ఏర్పడిన ఇబ్బంది వల్ల హిట్లర్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను మరోసారి వెండితెరపై చూసి ఎంజాయ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.క్వాలిటీ పరంగా అభిమానులకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అభిమానులు మరికొద్ది రోజులు వెయిట్ చేయవలసిందిగా మేకర్స్ కోరారు. జనవరి 1న గేమ్ ఛేంజర్ నుంచి తాజా అప్ డేట్ రాబోతుంది. అదేవిధంగా సంక్రాంతికి సినిమా విడుదలకాబోతుండడంవల్ల కూడా వాయిదా కారణంగా చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు