చిరంజీవి గుండు వెనకున్న అసలు కథ ఇదేనా?

శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:22 IST)
మెగాస్టార్ చిరంజీవి గుండుతో ఉన్న స్టిల్ రిలీజ్ చేసారు. ఈ స్టిల్ బయటకు వచ్చినప్పటి నుంచి అందరిలో ఒకటే డౌట్. ఈ స్లిల్ ఓరిజినలా..? మార్ఫింగా..? అని. అయితే.. ఈ స్టిల్‌ని చిరంజీవి పీఆర్ టీమ్ రిలీజ్ చేసింది. సో.. ఈ స్టిల్ ఒరిజినలే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. చిరంజీవి ఈ స్టిల్ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసినట్టు అనేది ఆసక్తిగా మారింది.
 
అక్టోబర్ నెలాఖరు నుంచి ఆచార్య మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో గుండు లుక్‌లో ఉంటే.. చిరుతో ఆచార్య షూటింగ్ చేసేది ఎలా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరు పీఆర్ టీమ్ చెబుతుంది ఏంటంటే... చిరంజీవి భవిష్యత్‌లో చేయనున్న సినిమాలో క్యారెక్టర్ కోసం ట్రైల్ గెటప్ ఇది అన్నారు. 
 
దీనిని బట్టి ఆచార్య తర్వాత చిరంజీవి వేదాళం రీమేక్ చేయనున్నారు. ఆ సినిమా కోసమే ఈ గెటప్ అంటున్నారు. మరో వార్త ఏంటంటే... చిరంజీవి బాబీ డైరెక్షన్లో మూవీ చేయనున్నారు. ఆ సినిమా కోసం చిరు గుండు లుక్ టెస్ట్ చేసారంటున్నారు.
 
మరికొంత మంది అయితే... ఆచార్యలో సినిమాలోనే ఓ సన్నివేశంలో ఇలా కనిపించనున్నారు. అందుకే ఈ గెటప్ అంటున్నారు. ఈ విధంగా చిరు గుండు స్టిల్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఇది హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఎవరుకు తోచినట్టుగా వాళ్లు ఊహించుకుంటున్నారు. మరి.. చిరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు