Varun jtej: చిరంజీవి కోణిదేల కుటుంబంలో నవజాత శిశువుకు స్వాగతం పలికిన మెగాస్టార్ చిరంజీవి

దేవీ

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (16:07 IST)
Chiranjeevi, Varun Tej, Lavanya Tripathi, born baby
కొణిదేల కుటుంబంలో పుట్టిన నవజాత శిశువుకు హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ముద్దాడుతూ ఫొటోను షేర్ చేశారు. చిన్నారి, ప్రపంచానికి స్వాగతం అని పేర్కొన్నారు. 
 
నేడు ఉదయం హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ లో వరుణ్ తేజ్, లావణ్య దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. దీనితో కొణిదెల కుటుంబానికి మరో వారసుడు వచ్చాడని చెప్పాలి. ఇక ఈ వార్త విన్న అభిమానులు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నారు. నీహారిక, నాగబాబు కూడా ఆసుపత్రికి వెళ్ళి చూసి వచ్చారు. గర్వించదగిన తల్లిదండ్రులు అయినందుకు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠికి హృదయపూర్వక అభినందనలు అంటూ పేర్కొన్నారు.
 
గర్వించదగిన తాతామామలుగా పదోన్నతి పొందిన నాగబాబు, పద్మజకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డకు అన్ని రకాల ఆనందం, మంచి ఆరోగ్యం మరియు సమృద్ధిగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డను చుట్టుముట్టాలి అంటూ మెగాస్టార్ కోరుకున్నారు. వరుణ్ తేజ్ చాలా ఆనందంతో తన కొడుకును చూస్తున్న ఫొటో అభిమానులను అలరిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు