వాళ్ళను తృప్తిపరిస్తే చాలంటున్న మెహరీన్

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (18:41 IST)
మెహరీన్ అందరిలా కాదు. నా రూటే వేరు. నేను కథలు వినను. సినిమా చేయాలని దర్సకుడు, నిర్మాతలు ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే ఒప్పుకుంటాను. కాల్షీట్లు ఇచ్చేస్తాను అంటోంది మెహరీన్. వరుస విజయాలతో మెహరీన్ తెలుగు సినీ పరిశ్రమలో దూసుకుపోతోంది.
 
అయితే ఎఫ్..2 సినిమా తరువాత ఆమె ఆచితూచి అడుగులు వేస్తోందన్న ప్రచారం బాగానే సాగుతోంది. దీనికి సమాధానం చెప్పింది మెహరీన్. నేను కథలు వినను. ముందు నుంచి నాకు అదే అలవాటు. అభిమానులను తృప్తిపరచడం నాకు ఇష్టం. హీరో ఎవరైనా, నటీనటులు ఎవరున్నాసరే పట్టించుకోను అంటోంది మెహరీన్. 
 
తనకు అభిమానులే ముఖ్యమని.. కాబట్టి తన క్యారెక్టర్ అభిమానులకు నచ్చితే చాలంటోంది. విజయాలు, అపజయాలు మామూలేనని దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది. తనకు మాత్రం ఈ మధ్యకాలంలో వరుస విజయాలు వస్తుండడం సంతోషంగా ఉందంటోంది మెహరీన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు