మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వృద్ధురాలు.. చెప్పులుకొనిచ్చిన పేర్ని నాని

బుధవారం, 17 మే 2023 (09:59 IST)
ఓ వృద్ధురాలి పట్ల వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని పెద్ద మనస్సు చూపించారు. కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో నడిచి వెళుతున్న వృద్ధురాలిని గమనించిన ఆయన.. ఆ వృద్ధురాలిని షోరూమ్‌కు తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు. 
 
మచిలీపట్నంలో కాళ్లకు చెప్పులు లేకుండా నడి ఎండలో ఓ వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో పేర్ని నాని కూడా అటుగా వెళుతున్నారు. ఎండ దెబ్బకు జనసంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో ఆ వృద్ధురాలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ వెంటనే కారు ఆపి ఆ వృద్ధురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 
ఆ తర్వాత ఆమెను ఓ పాదరక్షల షోరూమ్‌కు తీసుకెళ్లి, ఆమెకు నచ్చిన చెప్పులను తీసిచ్చారు. ఆ తర్వాత చెప్పులు ఎలా ఉన్నాయమ్మా.. లూజుగా ఉన్నాయా.. సరిగ్గా సరిపోయాయా అని అడిగి తెలుసుకున్నారు. చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధులు రెండు చోతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు