Vikrant, Chandni Chowdhury, Madhura Sridhar Reddy, Nirvi Hariprasad Reddy
విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీజర్ ఇటీవల విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది. ఈ టీజర్‌ను తాజాగా గానా & రేడియో మిర్చి నిర్వహించిన మైండ్ స్పేస్ ఎకో రన్ లో ప్రదర్శించారు. ఈ టీజర్ ఎకో రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి, నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకుడు సంజీవ్ రెడ్డి, రైటర్ షేక్ దావూద్ జీ పాల్గొన్నారు.