dr. pooja, Konda Surekha, Bhimagani Sudhakar
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం "అభినవ్" చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సుధాకర్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సమాజ శ్రేయస్సు కోసం, లాభాపేక్ష లేకుండా ఈ చిత్రాన్ని భీమగాని సుధాకర్ గారు నిర్మించడం అభినందనీయం. ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుంది అన్నారు.