నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ప్రముఖ నిర్మాణ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.