అమర్ గీత్ సంగీత సారధ్యంలో శివమణి రాసిన ఈ పాటను.. భవదాయిని నాగరాజ్, విద్యుత్ శ్రీనివాస్, థామస్ చిరమేల్ అలెగ్జాండర్ ఆలపించారు. ఇదే పాటను దుబాయి నుంచి కూడా విడుదల చేయడం విశేషం.
పాట విడుదల అనంతరం యువ సంచలనం మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ..."చిన్నప్పటినుంచి సినిమాలే లోకంగా పెరిగాను. సినిమాలే నా జీవితం అని ఫిక్సయిపోయాను. నా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా... బోలెడు వినోదానికి రవ్వంత సందేశం జోడించి రూపొందిస్తున్న "లవ్ స్టొరీ బిగిన్స్" ప్రేమ చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది" అన్నారు. "లవ్ స్టొరీ బిగిన్స్" చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్లు వర్ష, శ్వేత హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దుబాయిలో షూటింగ్ జరుపుకునే "లవ్ స్టొరీ బిగిన్స్" ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ.