"పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. మనమందరం కలిసి జరుపుకోవాల్సిన ఈ రోజున, నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను. మనం కలిసి గడపగలిగే క్షణాల కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను" అని మనోజ్ తన పోస్ట్‌లో రాశారు.
తన సందేశంతో పాటు ఒక ఫోటో, వీడియోను కూడా పంచుకున్నారు. ఇటీవల, మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని వలన మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య దూరం పెరిగింది. ఇలాంటి సందర్భంలో, మనోజ్ చేసిన భావోద్వేగ పోస్ట్ ఈ వివాదాలను సద్దుమణిగించేలా వుందని నెటిజన్లు అంటున్నారు.