మలయాళ నటుడు పృథ్వీరాజ్‌కు కరోనా.. నన్ను కలిసిన వారంతా..?

మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:46 IST)
Prithivi Raj
కరోనా మహమ్మారి సెలబ్రిటీలని సైతం వణికిస్తోంది. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. పృథ్వీరాజ్ 'ఆదుజీవితం' షూటింగ్‌ నిమిత్తం ​జోర్డాన్‌కి వెళ్ళగా, లాక్‌డౌన్ వలన దాదాపు రెండు నెలలు అక్కడే ఉండిపోయాడు. భారత్‌ చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 'ఆదుజీవితం' చిత్ర బృందం మే 22న ప్రత్యేకం విమానంలో భారత్‌ తిరిగొచ్చారు. 
 
అనంతరం కేరళకు చేరుకున్న వీరందరిని 14 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉంచారు. అనంతరం పృథ్వీరాజ్‌ కోవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ అని తేలింది. ఈ నేపథ్యంలో పృథ్వీకి కరోనా పాజిటివ్ అన తేలింది. దీంతో త్వరగా కోలుకొని మళ్ళీ మీ ముందుకు వస్తానంటూ సోషల్ మీడియా ద్వారా పృథ్వీరాజ్ తెలిపారు. పృథ్వీరాజ్ తన పోస్ట్‌లో.. హాలో.. నేను అక్టోబర్ 7 నుండి జనగణమన అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాను. 
 
షూటింగ్ సమయంలో కరోనా జాగ్రత్తలు అన్ని పాటించాం. నిబంధనల ప్రకారం షూటింగ్‌లో పాల్గొనేముందు అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. చివరి రోజు కోర్ట్ ఎపిసోడ్ జరగగా, అది పూర్తైన తర్వాత మళ్లీ టెస్ట్‌లు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు రిజల్ట్స్‌లో పాజిటివ్ అని తేలింది. వెంటనే ఐసోలేషన్‌కు వెళ్ళాం. ఇక తనతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ఉన్న వారు తప్పక టెస్ట్‌లు చేయించుకోండని పృథ్వీరాజ్ విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు