పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ సినిమా పరిశ్రమకు అంతులేని అనుబంధం వుంది. మొదట్లో పబ్లిసిటీని పోస్టర్ లను సినిమా విడుదలముందు ఆయన డిజైన్ చేస్తేనే కానీ హీరోలుకానీ, స్టూడియో సంస్థలుకానీ ఒక ఐడియాకు వచ్చేవారుకాదు.
అప్పట్లో హీరోల ఫొటోలు తీసి పబ్లిసిటీ చేయడం తెలీదు. కేవలం పబ్లిసిటీ డిజైన్ వేసిన పోస్టర్ల ఆధారంగానే సినిమా విడుదలను నిర్ణయించేవారు. ఆ దశలో నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుడు గెటప్, దుర్వోధనుని గెటప్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. సింహంపై కూర్చుని ఠీవిగా వున్న ఎన్.టి.ఆర్. ఫొటో ఇప్పటికీ అందరికీ గుర్తిండే వుంటుంది. అలాంటి ఈశ్వర్‌కు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.