నాట్యం చేసిన కమల్‌కామరాజు, సంధ్యారాజు - పాట ఆవిష్కరించిన బాలకృష్ణ
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:45 IST)
Kamal-Sandhya raju
గత రెండు రోజులుగా హీరో కమల్‌కామరాజ్ నాట్యం చేశాడంటూ చిన్న బైట్ హల్‌చల్ చేసింది. సెలబ్రిటీలు ఆయన ఇంటీరియర్ డెకరేటర్‌గదా! నాట్యం చేశాడా! అంటూ ప్రచారానికి ఊతం ఇచ్చారు. కనుక ఆలస్యం చేయకుండా శుక్రవారం `నాట్యం` సినిమాలోని శివతాండవం సాంగ్‌ను నందమూరి బాలకృష్ణ విడుదలచేశారు.
`నాట్యం` అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ `నాట్యం` చిత్రం ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాపర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతున్నారు. ఆమె తన డాన్స్, హావభావాలు, నటనను అద్భుతంగా పండించారు.
ఈ సినిమాలో తొలి సాంగ్ `నమః శివాయ`ను శుక్రవారం రోజున నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన, సంధ్యారాజు, దర్శకుడు రేవంత్ కోరుకొండ, యాక్టర్ కమల్ కామరాజ్ తదితరులు `నాట్యం` సినిమా కోసం పడ్డ కష్టం అసాధారణమని.. ఇలాంటి ఓ వైవిధ్యమైన సినిమాను పాటలను ఈ జనరేషన్‌కు అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ``నటి, నిర్మాత సంధ్యారాజుగారిని, దర్శకుడు రేవంత్ కోరుకొండగారిని, అలాగే నా సోదరుడు కమల్ కామరాజుని `నాట్యం` వంటి సినిమా చేసినందుకు అభినందిస్తున్నాను. ఈ సినిమాలో `నమః శివాయ` అనే పాటను విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపుర నియోజక వర్గంలోని లేపాక్షి ఆలయంలోనే ఈ పాటను చిత్రీకరించారు. భారతదేశం కళలకు కాణాచి. ఎన్నో కళలకు సంబంధించి గొప్ప గొప్ప కళాకారులందరూ మన దేశానికి వన్నె తెచ్చారు. ఇక `నాట్యం` సినిమా విషయానికి వస్తే, రేవంత్ కోరుకొండగారు రైటర్‌గా, దర్శకుడిగా సినిమా చేయడమే కాకుండా కెమెరావర్క్, ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించడం గొప్ప విషయం. ఇప్పుడు విడుదల చేసిన పాట చాలా అద్భుతంగా ఉంది. అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. యాదృచ్చింగా ఇప్పుడు నేను చేస్తున్న అఖండ సినిమాలో నేను అఘోరా పాత్రను చేశాను. ఆ శివుడి ఆశీస్సులు ఈ టీమ్‌కు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఈ జనరేషన్‌లో క్లాసికల్ డాన్సర్‌గా సంధ్యారాజు ఇప్పటికే తనేంటో రుజువు చేసుకున్నారు. ఇప్పుడు విడుదలైన నాట్యంలోని నమఃశివాయ సాంగ్‌లో మరోసారి అద్భుతమైన ప్రదర్శనను చేశారు. ఈ పాట ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులను హృదయాల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. రేవంత్ కోరుకొండ వంటి యంగ్ టాలెండ్ డైరెక్టర్, కేవలం దర్శకత్వమే కాకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లోనూ తన ప్రతిభను చాటారు. కమల్ కామరాజు `నాట్యం` సినిమా కోసం ఏడాది పాటు కష్టపడి తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఈ చిత్రంలో ఆయన ఓ క్లాసికల్ డాన్సర్‌గా కనిపిస్తారు. సంధ్యారాజుగారి శిక్షణలో ఏడాది పాటు కూచిపూడిలో శిక్షణ కూడా తీసుకున్నారు.
ఈ సాంగ్ చిత్రీకరణకు ఆరు రోజుల సమయం పట్టింది. వందలాది జూనియర్ ఆర్టిస్ట్స్ ఇందులో పాల్గొనగా లేపాక్షి ఆలయంలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను 40 డిగ్రీల ఎండలో చిత్రీకరించారు. ఎంతో కష్టమైనా, కాళ్లు మండుతున్నా డాన్సర్స్ ఈ పాటను పూర్తి చేశారు. జగద్గురు ఆది శంకరాచార్య వారి అర్థనారీశ్వర స్తోత్రాన్ని పాటగా మలిచారు. శ్రవణ్ భరద్వాజ్ ఈ పాటను క్లాసిక్, ఫ్లోక్ స్లైల్లో ఆధ్యాత్మికంగా మలిచారు. కాలా భైరవ, లలిత కావ్య ఈ పాటను పాడారు. ఓ డెబ్యూ నిర్మాణ సంస్థ, డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన దైవత్వం నిండిన ఈ పాటను వీక్షించడానికి అద్భుతంగా ఉంది.
లహరి యూట్యూబ్ ఛానెల్‌లో ఈ పాటను విడుదల చేశారు. మ్యూజిక్ లవర్స్ కచ్చితంగా వినాల్సిన పాట. అద్బుతమైన విజువల్స్‌తో అందమైన ఆర్టిటెక్చర్ ఉన్న హంపి, లేపాక్షి, బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఆలయాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.