ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తేనున్నది. టికెట్ల బుకింగ్ పోర్టల్ ను ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షించనున్నది. దీని విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించనున్నది. దీనికి సంబంధించిన జీ.ఓ.ను విడుదల చేసింది. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో ఆన్‌లైన్ బుకింగ్ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుందని తెలుస్తోంది. కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇస్తారు, అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయని తెలుస్తోంది.