కేరళలో నిపా వైరస్ కలకలం: ఐసోలేషన్‌లోకి 68 మంది

బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:48 IST)
కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతూనే ఉన్నది. నిపా వైరస్ కారణంగా ప్రస్తుతం కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 68 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి తెలిపారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆమె ఒక ప్రకటన చేశారు. 
 
అయితే, ఐసోలేషన్‌లో ఉన్న ఆ 68మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా లిస్టవుట్ చేసిన వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటివరకు వారిలో 30 మందికి నెగెటివ్ వచ్చిందని ఆరోగ్యమంత్రి వెల్లడించారు.
 
కోజికోడ్‌లో తొలి నిపా కేసు నమోదై 12 ఏండ్ల బాలుడు మృతిచెందినప్పటి నుంచి అంటే గత నాలుగు రోజుల నుంచి కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జి అక్కడే మకాం వేశారు. ఇదిలావుంటే కాంటాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 251 మందిని లిస్టవుట్ చేశారు.
 
అందులో 129 మంది హెల్త్ వర్కర్లు కాగా, మరో 54 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారు. కేవలం 11 మందిలో మాత్రమే నిపా సింప్టమ్స్ ఉన్నాయి. హై రిస్క్ కేటగిరీలో ఉన్న 54 మందిలో కూడా 30 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు