OG : పవన్ కళ్యాణ్ యాక్షన్ చిత్రం ఓజీ షూటింగ్ పూర్తి

దేవీ

శుక్రవారం, 11 జులై 2025 (20:06 IST)
OG - Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'ఓజీ'. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ  'ఓజీ' చిత్రీకరణ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ కారు దిగి గన్ తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
 
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో అడుగు పెట్టనుంది.
 
ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'ను నిర్మించిన డీవీవీ 
ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో ఈ చిత్రం రూపొందుతోంది. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా ఇప్పటికే 'ఓజీ' ప్రశంసించబడుతోంది.
 
రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా మలిచేలా సాంకేతిక బృందం కృషి చేస్తోంది.
 
పవన్ కళ్యాణ్ సరైన యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంచలన చిత్రంగా 'ఓజీ' రూపుదిద్దుకుంటోంది. యాక్షన్ ప్రియులతో పాటు మాస్ మెచ్చేలా ఈ చిత్రం ఉండనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు