ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత జానీ మాస్టర్ సంతోషంగా ఉన్నాడంటూ వచ్చిన మీమ్స్ మీదా స్పందించాడు. అసలు పగవాడికి, శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రావొద్దని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. జైల్లో ఫస్ట్ డే నరకంగా అనిపించిందట. ఎంతటి పెద్దవారైనా సరే నేల మీదే పడుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ రోజు జైల్లో తాను అలా ఒంటరిగా ఉండటం భరించలేకపోయాడని తెలిపాడు.
తన భార్య, పిల్లలు, అమ్మ చాలా గుర్తుకు వచ్చారట. అమ్మకి అసలే ఆరోగ్యం బాగా లేదని, హార్ట్ కొంచెం వీక్‌గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేం అవుతుందో అని టెన్షన్ పడ్డాడట.