MS విశ్వనాథన్ హనుమంతుడి లాంటివాడు... కానీ ఉడుతలా..?: రజనీకాంత్

బుధవారం, 29 జులై 2015 (17:25 IST)
ఇటీవలే కన్నుమూసిన సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌ను దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెస్వీ చాలామందికి ఓ హనుమంతుడిలా సాయం చేశారని, అదే సమయంలో ఉడుతలా సాధారణ జీవనం గడిపారని రామాయణాన్ని ఉదహరించారు. సంగీత రంగంలో ఎమ్మెస్వీ మహనీయుడని కొనియాడారు. 
 
దేవుని ఆశీస్సులు మెండుగా ఉన్న వ్యక్తుల్లో ఆయనొకరని రజనీ తెలిపారు. ప్రతిభ ఉంటే పేరుప్రతిష్ఠలతో పాటు అహంభావం కూడా దరిచేరుతుందని, కానీ, ఎమ్మెస్ మాత్రం అహంకారాన్ని దరిచేరనీయలేదని అన్నారు. ఎమ్మెస్వీ ప్రతిభ భగవంతుడి వరప్రసాదమని రజనీకాంత్ పేర్కొన్నారు. 
 
తమిళ నట దిగ్గజాలైన ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్‌లకు మంచి వాయిస్ ఇచ్చిన ఎమ్మెస్వీ.. కె బాలచందర్ సినిమాలకు విశ్వనాథన్ మంచి మ్యూజిక్ ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేశారు. కాగా 1000 పాటలు రాసిన ఎంఎస్ విశ్వనాథన్ అనారోగ్యం కారణంగా ఈ నెలలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి