సినీ పరిశ్రమకు సేవ చేయడమే నా విజన్, నా మిషన్: విష్ణు మంచు

బుధవారం, 20 ఏప్రియల్ 2022 (23:20 IST)
నటుడు, నిర్మాత విష్ణు మంచు... మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (MAA) అధ్యక్ష బాధ్యతలలోకి అడుగుపెట్టిన ఆరు నెలల కాలంలోనే, తెలుగు సినీ పరిశ్రమలో “మా” పోషించే పాత్రలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చారు. ఈ మార్పులకు ప్రారంభంగా, సీనియర్లు మరియు అర్హత గల కళాకారులకు పెన్షన్‌ సౌకర్యాన్ని చెప్పుకోవాలి, ఈ పెన్షన్‌ పథకం పారదర్శక వ్యవస్థతో ప్రారంభించగా, దీనిని ఎప్పటికప్పుడు నిశితమైన పేపర్‌వర్క్‌తో పరిశీలిస్తారు. పరిశ్రమలోని వృద్ధ కళాకారులను వారి అంత్య కాలంలో జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచనతో దీనిని ప్రారంభించారు.

 
అంతేకాకుండా, ఈ సంస్థ వెబ్‌ ప్రపంచంలో అందుబాటులో ఉండేలా, అలాగే కళాకారుల కోసం సిద్ధంగా ఉండేలా చేసేందుకు, విష్ణు మంచు డిజిటల్ టెక్నాలజీని కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా maa asia పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా హ్యాండిల్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది.

 
ఇది ఈ రంగంలోని కళాకారుల డేటాను మొత్తం సమీకరించి, వివిధ నిర్మాణ సంస్థలలో ఉన్న అవకాశాలను వారికి తెలియజేసే వారధిగా ఉండేలా, ఓ ప్రత్యేకమైన యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. యువకుడిగా, ముందస్తు ఆలోచనలు గల అధ్యక్షునిగా సంస్థ భవిష్యత్ అవకాశాలు మరియు టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని, సంస్థ కార్యాచరణలు ఉంటాయని విష్ణు మంచు నిర్ధారించారు.

 
ప్రస్తుత పరిస్థితులలో, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనేది ప్రాథమిక పరిగణన అంశంగా మారింది. దానిని దృష్టిలో ఉంచుకుని, సంస్థలోని సభ్య కళాకారులకు ఆరోగ్య బీమా పథకాలు అందించబడ్డాయి, ఇది వారికి మాత్రమే కాకుండా, వారి ప్రియమైన, సన్నిహితమైన వారికి కూడా ప్రయోజనం కలిగిస్తుంది. సభ్యులు తక్కువ ధరలకే సహేతుకంగా వైద్య చికిత్స పొందగలిగేలా, హాస్పిటల్స్ మరియు మెడికల్ ఫెసిలిటీస్‌తో... సంస్థ జట్టు కట్టింది. ఆరోగ్యంతో పాటు విద్యపై కూడా శ్రద్ధ చూపుతున్నారు. “మా” సభ్యుల పిల్లలకు తిరుపతిలోని మోహన్‌ బాబు యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌ పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ప్రతి నిర్మాణ సంస్థలోను, అలాగే ప్రతి సెట్‌లోను మహిళలకు సురక్షితమైన పని వాతావారణాన్ని కల్పించడంలో సహాయం చేసేందుకు, శ్రీమతి సునీతా కృష్ణన్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

 
తాను సాధించిన విజయాల గురించి విష్ణు మంచు మాట్లాడుతూ, “నేను ఇంకా కొన్ని బాక్స్‌లను టిక్‌ చేయలేకపోయాను. గత నాలుగు దశాబ్దాల కాలంలో నా కుటుంబానికి, నాకు ఎంతో అందించిన ఈ పరిశ్రమ కోసం... నేను ఎంతో చేయాలని అనుకుంటున్నాను. మేము అందరం ఇక్కడ ఎంతో అభివృద్ధి సాధించాము, ఇంకా బోర్డ్ కళాకారులకు సేవ చేయడం ద్వారా, ఆ రుణాన్ని తిరిగి చెల్లించాలని నేను భావిస్తున్నాను, అలాగే ‘మా’ వారికి వెన్నుదన్నుగా నిలుస్తుంది, వాళ్లు ఏ సమయంలోనైనా మా దగ్గరకు రావచ్చు, అలాగే ప్రతి సమయంలోను వారికి, వారి అవసరాలకు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇచ్చేందుకే మేము ఇక్కడ ఉన్నాము. పరిశ్రమతో సంబంధం గల ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా, పరిశ్రమకు సేవ చేయడమే, పదవీ కాలంలో నా విజన్ మరియ మిషన్,” అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు