మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో ఐటీ సోదాలు.. నిర్మాత ఎర్నేని నవీన్‌కు అస్వస్థత

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (15:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రక్తపోటు ఎక్కువ కావడంతో ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. నవీన్ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు బీపీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ను సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
 
కాగా, గత మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయాలు, దర్శక నిర్మాత కె.సుకుమార్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, ఎర్నేని నవీన్ ఇంట్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు