చైతూతో రొమాంటిక్ పాటల చిత్రీకరణలో శృతిహాసన్

మంగళవారం, 19 జులై 2016 (12:35 IST)
నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్‌, శతి హాసన్‌, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రంలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మళయాలంలో విజయం సాధించిన 'ప్రేమమ్‌' సినిమాను తెలుగులో అదే పేరుతో నాగ చైతన్యతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాను 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమా, వారం రోజులుగా నార్వేలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
 
ఈ నార్వే షెడ్యూల్‌లోనే పలు అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. శృతి హాసన్‌, చైతన్య పాల్గొంటుండగా ప్రస్తుతం ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు చందూ మొండేటి, నాగ చైతన్య, సినిమాటోగ్రాఫర్‌ కార్తీక ఘట్టమనేనిలతో కలిసి దిగిన ఓ ఫోటోను శృతి హాసన్‌ పోస్ట్‌ చేశారు. తన కెరీర్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని నాగ చైతన్య మొదట్నుంచీ నమ్మకం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వెంకటేష్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆగష్టులో విడుదల కానుంది. 

వెబ్దునియా పై చదవండి