కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేమ, కుటుంబ ఆప్యాయతలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రం. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఈ టైటిల్ అంటే నాగచైతన్యకు చాలా ఇష్టమట. అందుకే ఇప్పుడు తను చేయబోయే సినిమాకు టైటిల్‌గా ''నిన్నే పెళ్ళాడతా''ను పెట్టుకోవాలని చైతు భావిస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మొదట 'కళ్యాణం' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి.