శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, -శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా థ్యాంక్యూ మూవీ ప్రమోషన్లో భాగంగా బిజీగా ఉన్న చైతూ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.
'అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నాపై అంతులేని ప్రేమను చూపించిన అమ్మకు థ్యాంక్స్', 'నాకు తోడుగా నిలిచినందుకు, స్నేహితుడిగా ఉన్నందుకు నాన్నకు 'థ్యాంక్స్ 'ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థ్యాంక్స్ హ్యాష్' అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చాడు.