నాగార్జున అక్కినేని, ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో చేస్తున్న 'నా సామి రంగ' సినిమాని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా విజయ్ బిన్నికి ఇది తొలి చిత్రం. ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను వరలక్ష్మిగా తాజాగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కట్టిపడేసింది.