''బాహుబలి-2'' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బిజినెస్ ఊపందుకుంది. ఇప్పటికే చాలా ఏరియాలకు సంబంధించిన రైట్స్ భారీ రేటుకు అమ్ముడుయ్యాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ నాగార్జున, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులను కొనుగోలు చేశారని తెలిసింది. ఇదే ఏరియాకు సంబంధించి బాహుబలి మొదటి భాగం 6.5 కోట్లకు కొనుగోలు కాగా, బాహుబలి 2 మాత్రం 8 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఈ లెక్కన చూస్తే భారత్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ''బాహుబలి 2" నిలిచిపోయే ఛాన్స్ ఉందని సినీ పండితులు చెప్తున్నారు. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వారాహి చలన చిత్ర అధిపతి అయిన సాయి కొర్రపాటితో కలిసి కృష్ణా జిల్లా హక్కులను ఆయన కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఇందుకోసం రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.