Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

దేవీ

శనివారం, 22 మార్చి 2025 (10:49 IST)
Tamanna Bhatia Airport
నటి తమన్నా భాటియా ఓదెల 2 సినిమాలో మహిళా నాగసాధువుగా నటించింది. ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా  టీజర్‌ను  కుంభమేళాలో నిర్వహించారు. ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కాబోతుంది. కనుక ప్రచారం కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తూ ఇలా ఫోజ్ ఇచ్చింది. పెద్ద స్క్రీన్‌లపై డివైన్ థ్రిల్లర్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ కాప్షన్ జోడించింది. 
 
2022లో విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఓదెలా-2 రాబోతుంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్ బ్యానర్‌పై సంపత్ నంది, కథను అందిస్తూ నిర్మించారు. చీకటి రాజ్యమేలినప్పుడు మరియు ఆశ మసకబారినప్పుడు 'శివశక్తి' మేల్కొంటుంది అంటూ మేకర్స్ తమ చిత్రం సారాంశాన్ని ముక్తసరిగా వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌ ఫుల్ వారం ప్రమోషన్ల కోసం ఆమె వచ్చింది. అనంతరం హిందీ సినిమా షూట్ లో జాయిన్ కానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు