బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ సుందరి తనుశ్రీ ప్రస్తుతం ఇక్కట్లలో చిక్కుకుంది. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ తెలిపింది. అయితే ఆ సమయంలో బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి తనను రక్షించారని చెప్పింది.
ఓ సినిమాలో సీనియర్ నటుడు నానా పటేకర్ తనను వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమెకు నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ దత్తా తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పటేకర్ తన న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ ద్వారా తను శ్రీ దత్తాకు నోటీసులు పంపారు.
కాగా 2008లో హార్న్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించింది. కేవలం అతనే కాకుండా కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా తనను వేధించారని వాపోయింది. వివేక్ అగ్నిహోత్రి తనను బట్టలిప్పి నగ్నంగా డ్యాన్స్ చేయమని వివేక్ బలవంతపెట్టాడని తనుశ్రీ ఆరోపించింది.
నటుడు ఇర్ఫాన్ ఖాన్, హీరో సునీల్ శెట్టి ముందు నగ్నంగా డ్యాన్స్ చేయమని తను శ్రీని వివేక్ ఆజ్ఞాపించాడట. అయితే అలాంటి డ్యాన్స్‌లేం వద్దని ఇర్ఫాన్ ఖాన్, సునీల్ చెప్పారట. దాంతో వివేక్ వెనక్కి తగ్గాడని తనుశ్రీ వెల్లడించింది. తనుశ్రీ దత్తాకు ప్రియాంకా చోప్రా, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ సహా పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.