అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాలను తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగు తెరపై ఎప్పూడూ చూడని కథాంశం తెరమీదకు తెస్తున్న చిత్రం జెట్టి నిలుస్తుంది. ప్రపంచీకరణతో మారుతున్న జీవనశైలిలో తాము నమ్ముకున్న సముద్రం మీద ఆధార పడుతూ అలలతో పోటీ పడతూ పొట్ట బోసుకుంటున్న జీవితాలను అంతేసహాజంగా తెరమీద పరిచాడు దర్శకుడు. అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయ్, అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ. మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం “జెట్టి”. నందత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు.
దర్శకుడు మాట్లాడుతూ, ఈ కథ మనుషుల జీవితాల్లోంచి పుట్టింది. ప్రపంచం ఎంత మారినా కొన్ని జీవితాలు అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ఒక ఊరిలో జరిగిన కథ ఇది. ఇప్పటి వరకూ దక్షణ భారతదేశంలో నిర్మించని కథ ఇది. తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, మళయాణంలో రిలీజ్ చేస్తున్నాం. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. కొన్ని వందల గ్రామాలు కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు కొన్ని తరాల పోరాటం, వారి కల ఒక గోడ, ఆ గోడ పేరే జెట్టి. ఈ అంశాన్ని ప్రధానంశంగా తీసుకుని, దీనితో పాటు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అరుదయిన జాతి సముద్రాన్ని నమ్ముకుంటూ, కడలికి కన్నబిడ్డలాగా, సముద్రానికి దగ్గరగా బతుకుతున్న జాతి "మత్స్యకారులు" వీళ్ళ జీవన శైలిని వారి కఠినమయిన కట్టుబాట్లని చూపిస్తూ తెరకెకించిన ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ సినిమాలో సిద్ శ్రీరాం పాట హైలెట్ గా నిలుస్తుంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తాం అన్నారు.
నటీ నటులు: నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ షెట్టి తదితరులు.
ఈ చిత్రానికి సంగీతంః కార్తిక్ కొండకండ్ల, కెమెరాః వీరమణి, ఆర్ట్ః ఉపేంద్ర రెడ్డి, ఎడిటర్: శ్రీనివాస్ తోట, స్టంట్స్: దేవరాజ్ నునె, డైలాగ్స్ః శశిధర్, పిఆర్ ఓ : జియస్ కె మీడియా, నిర్మాతః వేణు మాధవ్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ః సుబ్రహ్మణ్యం పిచ్చుక.