ఈ మూవీ న్యూ షూటింగ్ షెడ్యూల్ కాశ్మీర్‌లో ప్రారంభమైంది, ఇక్కడ టీం ఇతర కీలక సన్నివేశాలతో పాటు నాని, ఫైటర్స్ టీంతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఇప్పటికే నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడమతో ప్రొడక్షన్ పనులు సజావుగా సాగుతున్నాయి.
తన పాత్ర టఫ్, డైనమిక్ పర్సోనకి సరిపోయేలా నాని అద్భుతంగా మేక్ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.