టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

డీవీ

శనివారం, 14 డిశెంబరు 2024 (20:07 IST)
Nani, Allari Naresh, Subbu, Rajesh Danda, Amrita Iyer
హీరో అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్‌ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ రస్టిక్ యాక్షన్‌ డ్రామా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు నేచురల్ స్టార్ నాని ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
 
బచ్చల మల్లి (అల్లరి నరేష్) వర్షంలో అపస్మారక స్థితిలో పడివున్న సీన్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఓపెన్ అయ్యింది. రావు రమేష్ పోషించిన పోలీసు అధికారి పాత్ర బచ్చల మల్లి నిర్లక్ష్య ప్రవర్తనను హైలైట్ చేసే కీలకమైన సంఘటనలను వివరిస్తాడు - ఒకటి సత్యవరం జాతరలో జనంతో అతని హింసాత్మక ఘర్షణ, మరొకటి అతను వేశ్య కోసం పోలీసులపై దాడి చేయడం. అతని ఫెరోషియస్ గతం ఉన్నప్పటికీ, ఒక అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించడంతో మార్పుకు దారితీస్తుంది. అయితే వీరి బంధాన్ని ఆమె తండ్రి వ్యతిరేకిస్తున్నాడు. ఏదో త్రెట్ చూడటంతో ట్రైలర్ ఎక్సయిటింగ్ ముగుస్తుంది, ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. 
 
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, టీజర్ చూసి నరేష్ కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలనే ఉందని చెప్పాను. సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయింది, అది బ్లాక్ బస్టరా, ఏ రేంజ్ అనేది టైం డిసైడ్ చేస్తుందని చెప్పాను. నాకు నేనుగా ఈవెంట్ కి వచ్చాను. సుబ్బు నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. మజ్ను సినిమా చేస్తున్నప్పుడు తను నా వన్ మేన్ ఆర్మీ. ఏ అవసరం ఉన్నా తననే అడిగేవాణ్ణి. ఆ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ తనది కూడా. అప్పుడే తను డైరెక్ట్ అయిపోతాడని చెప్పాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ నా ఫేవరెట్. కృష్ణగాడి వీరప్రేమగాధ నా ఫేవరెట్ ఫిలిం. దానికి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు . ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా డెప్త్ ఉంది .సుబ్బు ట్రైలర్ లోనే కథ చెప్పాలనుకున్నాడు అంటే సినిమాలో ఇంకెంత హానెస్ట్ గా ప్రయత్నించి ఉంటాడో నేను ఊహించగలను. అమృత ఆల్ ది వెరీ బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే. ఈ డిసెంబర్లో పుష్ప2 ఫుల్ మీల్స్ పెట్టేసింది.ఈ డిసెంబర్ ని బచ్చలమల్లి సక్సెస్ తో మంచి డెసర్ట్ గా ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు 
 
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, 16 ఇయర్స్ నుంచి  నాని. మా జర్నీ కొనసాగుతుంది. లో టైం లో ఉన్నప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే. రోషన్, అంకిత్, జయరాం గారు, ప్రవీణ్ యాక్టర్స్ అందరూ చాలా ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు. సుబ్బు ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పారో అంతే అద్భుతంగా ఈ సినిమాని తీశారు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. విశాల్ చంద్రశేఖర్ గారు చాలా కొత్త సౌండ్ ఇచ్చారు. సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. నాకు ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ’ అన్నారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు