డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఆయన నటించిన కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్ వంటి చిత్రాలకు గద్దర్ అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సాయి కుమార్ ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో చౌకీదార్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు.