పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించింది. యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు. “One man will stand again, against all odds,” అనేది సినిమా క్యాప్షన్.
ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకట్టుకుంది. నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. అతని జుట్టు నుంచి ముఖం వరకు, ప్రతిదీ వార్తాపత్రికలతో డిజైన్ చేయబడింది. ఫస్ట్ లుక్ సూచించినట్లుగా, ప్రతినిధి 2 సోషల్ ఇష్యూస్ ని డీల్ చేయనుంది. ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.
కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.