పాన్-ఇండియన్ స్టార్ గా ఆమె ఎదిగిపోయింది. 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండతో గీత గోవిందంతో ఒక్కసారిగా మరింత పేరు తెచ్చుకుంది. అలా వారిమధ్య సాగిన జర్నీ ప్రేమ వరకు దారితీసిందనే టాక్ కూడా నెలకొంది. యానిమల్, పుష్ప 2 సినిమాలతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆక్షరించింది. అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమెను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.