ఈ సినిమాలో నటించిన హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు మంచి పేరునే తెచ్చి పెట్టింది. ముఖ్యంగా హీరోకు మంచి మైలేజ్ రావడమే కాదు డైరెక్టర్‌కు మంచి పేరునే సంపాదించి పెట్టింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తిరుమలలో సందడి చేశారు నటుడు నవీన్, హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా. శ్రీవారిని ఈరోజు ఉదయం దర్సించుకున్నారు. ఇద్దరూ కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు. దర్సనం తరువాత బయటకు వచ్చిన హీరో నవీన్, హీరోయిన్‌కు కొన్ని స్ధలాలను చూపించి వివరించారు.