టాలీవుడ్లో బాబు బంగారం, తమిళంలో ఇరుముగన్ సినిమాలతో మాంచి హిట్ కొట్టేసిన నయనతార ప్రస్తుతం భారీ ఆఫర్లను కైవసం చేసుకుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా హీరోలతో నటించేసే నయనతార గ్లామర్ ఫేడవుట్ కాకముందే.. తన గ్లామర్‌కు మరింత వన్నె తెచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే నాలుగు సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.
సాధారణంగా మూడు పదుల వయసొచ్చే సరికి హీరోయిన్లకు క్రేజ్ తగ్గిపోతుంది. కానీ నయన మాత్రం చాలా జాగ్రత్తలు పడుతోంది. తనలో గ్లామర్ తగ్గకుండా ఉండేందుకు హెవీ వర్కవుట్స్ చేస్తోందట. అందాన్ని పెంచుకునే దిశగా డైట్ ఫాలో కావడమే కాకుండా ఎక్సర్సైజ్, యోగా వంటివి చేస్తూ.. శరీరాకృతిలో తేడా రాకూడదని భావిస్తోంది.