NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

దేవీ

సోమవారం, 2 జూన్ 2025 (09:03 IST)
Akhanda2 poster
బోయపాటి శ్రీను, నందమూరి బాలక్రిష్ణ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా అఖండ2. తాజాగా షూటింగ్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిన్న గ్లిప్ కూడా సోషల్ మీడియాలో విడుదలచేశారు. బాలక్రిష్ణ అభిమానులు మాత్రం అఖండ 2 సినిమా కొత్త అప్ డేట్ రాబోతుందంటూ పోస్ట్ చేశారు.

ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం #అఖండ2 డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో విడుదల కానుంది. NBK పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న టీజర్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు అని తెలియజేస్తున్నారు.
 
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగ భాగం ఇండియాలోనే షూటింగ్ జరిగింది. సమకాలీన రాజకీయాలతోపాటు సనాధన దర్మం గురించి బోయపాటి తన దైన శైలిలో చూపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత శరత్ సక్సెనా విలన్ గా నటించడం విశేషం. 2021లో విడుదలైన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు