టాప్‌ లెస్‌గా నటించాలని చెప్పా... ఆమె ఓకే అనేసింది....

శనివారం, 24 డిశెంబరు 2016 (20:17 IST)
''మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే టాప్‌లెస్‌గా నటించింది. కథలో భాగంగా ఆమె అలా నటించాల్సివచ్చింది. చేస్తుందో లేదో అనే డైలమాలో వున్నాను. ఆ తర్వాత ఆమెను అడిగాను.. వెంటనే అంగీకరిచింది.. అప్పుడు తెలిసింది.. ఆమె డెడికేషన్" అంటూ దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. 
 
ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'శ్రీవల్లి'. పూర్వజన్మల నేపథ్యంలో కథ సాగుతుంది. కథరీత్యా ఆమె నీటిలో ఎక్కువ సేపు వుండాల్సివస్తుంది. సీన్‌పరంగా టాప్‌లెస్‌ వుండాలి. క్రిందిభాగం తడవాలి.. ఈ విషయం చెప్పగానే... రెడీ అనీ.. షూటింగ్‌లో ఎక్కువమంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఆమె చెప్పినట్లే పరిమిత సిబ్బందితో ఆ సీన్‌ను చిత్రీకరించారు. అది సినిమా కథకు కీలకమని... దర్శకుడు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి