బిగ్ బాస్ 4.. నాగార్జున స్థానంలో కొత్త హోస్ట్.. ఎవరో తెలుసా? (Video)

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:11 IST)
తెలుగు బిగ్ బాస్ కొత్త అందాన్ని సంతరించుకోనుంది. అక్కినేని నాగార్జున సారథ్యంలో ఇటీవలే నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల స్పందనను అందుకుంటోన్న ఈ షోలో భారీ మార్పు జరగబోతుంది. దీనికి హోస్ట్ చేస్తున్న నాగ్ స్థానంలో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. బుల్లితెరపై కొత్త చరిత్ర ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ ఆరున ప్రారంభమైంది. 
 
అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ షో ప్రీమియర్ ఎపిసోడ్‌కు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా భారతదేశంలోనే బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన తొలి షోగా ఇది నిలిచింది. అంతేకాదు, దాదాపు ఐదు కోట్లకు పైగానే ఓట్లు నమోదు చేస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గత సీజన్లతో పోలిస్తే ఇందులో రెట్టించిన వినోదాన్ని పంచబోతున్నట్లు స్టార్ మా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే సరికొత్త వ్యూహాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అవేమీ సక్సెస్ కాలేదు. ఇందులో భాగంగా ఇద్దరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరు కమెడియన్ కుమార్ సాయి కాగా, మరొకరు జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్. వీళ్లిద్దరితో పాటు రేపో మాపో స్వాతీ దీక్షిత్ అనే హీరోయిన్ కూడా లోపలికి వెళ్లబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్‌ షోకు కొత్త హోస్ట్‌ను తీసుకురాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. నాగార్జున స్థానంలో టాప్ హీరోయిన్ రాక పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న అనుష్క శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట.
 
ఇప్పటికే హోస్ట్‌గా ఉన్న నాగార్జున స్థానాన్ని ఆమె భర్తీ చేయబోతుందట. ఈ శనివారమో.. ఆదివారమో స్వీటీ షోలోకి గ్రాండ్‌గా ఎంటర్ అవబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. గత సీజన్‌లో రమ్యకృష్ణ నాగ్ స్థానంలో కొన్ని వారాల పాటు బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 
Anushka shetty
 
హోస్ట్ మారడం వెనుక అసలు కథ ఇదే నాగార్జున స్థానంలో అనుష్క రావడం వెనుక అసలు కథ ఏమిటంటే.. స్వీటీ ‘నిశ్శబ్ధం' అనే సినిమాలో నటించింది. అది అక్టోబర్ 2న అమెజాన్‌లో విడుదల కాబోతుంది. దీని ప్రమోషన్‌లో భాగంగానే ఆమె బిగ్ బాస్‌లోకి వస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్‌ను నాగ్ కాకుండా అనుష్క ఓపెన్ చేసి సర్‌ప్రైజ్ చేయబోతుందని అంటున్నారు. దీంతో బిగ్ బాస్‌పై ఆసక్తి పెరిగిపోతోంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు