అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

డీవీ

సోమవారం, 7 అక్టోబరు 2024 (17:09 IST)
Nikhil Siddharth, Rukmini Vasanth
నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్ కాంబినేషన్ లో స్వామి రారా, కేశవ త‌ర్వాత వస్తున్న చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌యింది. డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ నేత్రుత్వంలో రూపొందుతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి త‌మ 32 వ చిత్రంగా దీన్ని రూపొందిస్తోంది. సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌ .ప్ర‌సాద్ దీన్ని నిర్మిస్తున్నారు.
 
ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే హీరో నిఖిల్, హీరోయిన్ రుక్మిణి వ‌సంత్ న‌డుస్తూ వ‌స్తున్నారు. నిఖిల్ స్టైలిష్ లుక్‌ను ఉంటే, రుక్మిణి వ‌సంత్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఫ‌స్ట్ లుక్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది. స్వామిరారా, కేశ‌వ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల త‌ర్వాత నిఖిల్, సుధీర్ వ‌ర్మ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమా కావ‌టంతో ఆడియెన్స్ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ హిట్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావ‌టంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్ట‌టానికి సంసిద్ధ‌మ‌య్యారు.
 
బాపినీడు.బి ఈ చిత్రానికి స‌మ‌ర్పణ‌. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు