ప్లీజ్... నా డెలివరీ డేట్ కూడా చెప్పరూ.. నిక్కీ గల్రానీ వినతి (వీడియో)

శనివారం, 19 నవంబరు 2022 (08:41 IST)
ఇటీవల హీరో ఆదిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై హీరోయిన్ నిక్కీ గల్రానీ స్పందించారు. ప్లీజ్.. నేను గర్భందాల్చిన విషయం మీకు తెలిసింది కదా, అలాగే డెలివరీ డేట్‍‌‌ను కూడా మీరు చెప్పరూ ప్లీజ్ అంటూ సెటైర్లు వేశారు.
 
అదేసమయంలో తాను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.లాంటి రూమర్లు నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని, మీ ప్రేమ ఆదరణ ఇలాగే కొనసాగాలని ఆమె కోరారు. 
 
కాగా, మలుపు, కృష్ణాష్టమి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీ.. హీరో ఆది పినిశెట్టిని ఈ యేడాది మే నెలలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెండేళ్ల ముందు నుంచి ప్రేమలో మునిగితేలారు. 
 
డేటింగ్‌లో ఉన్నారు. పలుమార్లు వీరిద్దరూ బహిరంగంగానే కనిపించినప్పటికీ తాము మంచి స్నేహితులమని చెప్పుకున్నారేగాని ప్రేమికులుగా చెప్పుకోలేదు. ఈ క్రమంలో వారిద్దరూ మే నేలలో పెళ్లి చేసుకున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు