నటనకు ప్రాధాన్యత గల పాత్రల్ని ఎంచుకుంటూ.. స్కిన్ షో, గ్లామర్ రోల్స్, బికినీ రోల్స్‌కు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరు కొట్టేసిన నిత్యామీనన్.. టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకే మూసలో గల సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని.. తెలుగులో అయితే సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతాయని చెప్పింది.
తమిళంలో విక్రమ్ సరసన ఓ సినిమాలోనూ, కన్నడలో సుదీప్ సరసన మరో సినిమావో నటిస్తున్నానని.. అవి రెండూ తెలుగులో కూడా రిలీజ్ కానున్నట్లు నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పనితనం నచ్చుతుందని, చాలా నెమ్మదిగా తన పనులు తాను చేసుకోపోతారని.. టెన్షన్ పడరని చెప్పుకొచ్చింది.