ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నెగటివ్ రోల్‌లో వర్మ చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీని ఫలితం ఎన్నికల ప్రభావంపై వుంటుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఈ సినిమా విడుదలను ఆపేయాలని టీడీపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆపే సీన్ లేదని ఈసీ తేల్చేసింది.
తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్పందిస్తూ మార్చి 22న విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోలేమని స్పష్టం చేశారు. నిజంగానే ఈ సినిమాలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుంటే రిలీజ్ తర్వాతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మార్చి 22న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు.