కత్తి మహేష్‌ నగర బహిష్కరణ... నాగబాబు ఫుల్ సపోర్టు

సోమవారం, 9 జులై 2018 (13:17 IST)
వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు నగర బహిష్కరణ వేటువేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచినందుకుగాను పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
 
తమ అనుమతి లేకుండా నగరంలో అడుగుపెట్టవద్దని ఆదేశించారు. దీనికి తోడు, కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు... ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. కత్తి మహేష్ హైదరాబాద్‌లో ఉంటే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే కారణాలతో ఆయనపై బహిష్కరణ విధించారు. 
 
శ్రీరాముడిని విమర్శించిన కత్తి మహేష్‌పై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తున్న సంగతి తెలిసిందే. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు పెట్టారు. మరోవైపు, కత్తి వ్యాఖ్యలను నిరసిస్తూ... స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్ధమయ్యారు. 
 
అయితే, యాత్రకు అనుమతిని నిరాకరించిన పోలీసులు... ఆయనను గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటివద్దతో పాటు.. నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు మెగా బ్రదర్ నాగబాబు కూడా మద్దతు ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు